తూములూరి (వెంకట సుబ్రహ్మణ్య) శాస్త్రి

పుట్టుపూర్వోత్తరాలు

v పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా వేంగీ మండలం ముండూరు గ్రామంలో
v తలిదండ్రులు సదాచార పునీత శ్రీమతి మాణిక్యాంబ, వేదశాస్త్ర వినీత శ్రీ విశ్వపతి శాస్త్రి గార్లు

చదువు సంధ్యలు

v ఎమ్ ఎస్ సి అణువిజ్ఞాన శాస్త్రంలో ప్రథమశ్రేణి - సూక్ష్మాణు పరిశోధన
v కంప్యూటర్ టెక్నాలజీ అధ్యయనం, శిక్షణ, బహు కంప్యూటర్ భాషల స్వాధ్యయనం
v బిజినెస్ మానేజ్ మెంట్ లో శిక్షణ

ఉద్యోగ సద్యోగాలు

v ఎలక్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హైదారాబాద్) లో వివిధ అధికార పదవుల్లో పదేళ్ళు
v ప్రైమ్ కంప్యూటర్స్ సాఫ్ట్ వేర్ రీసెర్చ్ సంస్థ (కాన్ బెరా) లో ఉన్నత పదవిలో నాలుగేళ్ళు
v యునిసిస్ కంప్యూటర్స్ (సిడ్నీ) లో సాంకేతిక నిపుణుడు, మానేజర్ గా ఆరేళ్ళు
v ఆప్టస్ కమ్యూనికేషన్స్ (సిడ్నీ) లో వివిధ ఉన్నత మానేజర్ పదవుల్లో ఇరవైమూడేళ్ళు

వృత్తి ప్రవృత్తులు

v అభ్యసించింది అణుశాస్త్రమైనా – అభిమానించేది తెలుగు సాహిత్యాన్ని
v అనుసరించేది వాణిజ్య విధానమైనా – ఆశించేది వాణి సన్నిధానాన్ని
v వృత్తి కంప్యూటర్ల నిర్వహణైనా – ప్రవృత్తి కవితావ్యాసంగం, తెలుగుదనం ప్రసారం

సాధక బాధకాలు

v మదనగోపాల శతకం - నిందాస్తుతి రచన (1970)
v ఆస్ట్రేలియాలో మొట్టమొదటి తెలుగు సాహిత్య పత్రిక “తెలుగు పలుకు” నిర్వహణ (1988-2004)
v ఆస్ట్రేలియా నుంచి పూర్తిగా తెలుగులో ప్రచురింపబడిన “తెలుగు పలుకు” 5, 10 వ జన్మదిన ప్రత్యేక సంచికలు –
   “తెలుగు వెన్నెల”, “తెలుగు వసుధ” ల ప్రచురణలో ప్రముఖ పాత్ర (1993, 1998)
v ఆస్ట్రేలియాలో తెలుగు శతావధాన నిర్వహణ (1998)
v లలితాసహస్రనామాల “సిడ్నీ శారదా” స్తోత్రమాల 1000 ఆశువు శ్లోకాలు – (2003-2008)
v తెలుగు సాహిత్య చరిత్ర, వికాసాలపై “తెలుగు సాహిత్య లహరి” ఉపన్యాస పరంపర – 9 ఉపన్యాసాలు (2013-14)
v ఆంధ్ర మహాభాగవతంపై విశ్లేషణాత్మక ఉపన్యాసాలు – “భాగవత సుధా లహరి” – 15 ఉపన్యాసాలు (2016-18)
v లలితాసహస్రనామ భావార్ధ విశేషాలు – “లలితార్ధ సుధాలహరి” ఉపన్యాస పరంపర (2019-2021)
v లలితాసహస్రనామ రహస్య విశేష మంజూష – సవివర వ్యాఖ్యానం – 10 సంపుటాలు (2021-2022)
v మహాకవి కాళిదాసు చరిత్ర “భారతీ విలాసము” నాటక రచన – 2021

పూజాపునస్కారాలు

v ఢిల్లీ తెలుగు ఎకాడెమీ వారి N.R.I. Pride (ప్రవాసీ భారతీయ కృషి) పురస్కారం – 2000
v ఆచార్య దివాకర్ల వేంకటావధాని శతజయంత్యుత్సవ స్మారకోపన్యాసం – సన్మానం (సిడ్నీ, ఆస్ట్రేలియా) – 2012
v రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం) (తిరుపతి) లో ఆ విశ్వవిద్యాలయ ప్రథమ అధ్యక్షులు,
    మహామహోపాధ్యాయ పట్టాభిరామ శాస్త్రి వ్యాఖ్యానమాలా ఉపన్యాస పరంపర – సన్మానం – జనవరి 2019
v భువన విజయం (మెల్బోర్న్, ఆస్ట్రేలియా) వారిచే “భారతీ విలాసము – కాళిదాసు చరిత్ర” నాటక ప్రదర్శన – సన్మానం – ఏప్రిల్ 2022
v తెలంగాణా రాష్ట్ర గ్రంధాలయ సంస్థ (హైద్రాబాదు) వారిచే “భారతీ విలాసము” గ్రంధ ఆవిష్కరణ (త్యాగరాయ గానసభ, హైద్రాబాదు) – జూన్ 2022
v వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి తెలుగు సాహిత్య కృషి పురస్కారం (రవీంద్రభారతి, హైద్రాబాదు) – సెప్టెంబర్ 2022
v తెలుగు ఎసోసియేషన్ (సిడ్నీ, ఆస్ట్రేలియా) వారి సాహిత్య కృషి పురస్కారం – అక్టోబర్ 2022
v శ్రీ వేదగాయత్రీ పరిషత్ (సిడ్నీ, ఆస్ట్రేలియా) వారిచే “సాహితీ రత్న” బిరుదు, సాహిత్య కృషి పురస్కారం – అక్టోబర్ 2022