తెలుగు సాహిత్య లహరి

తెలుగు సాహిత్య లహరి – సాహిత్య ఉపన్యాస పరంపర

అక్టోబర్ 2012 లో సిడ్నీలో జరిగిన ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా “సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం” అన్న అంశంపై శ్రీ తూములూరి శాస్త్రి గారు ప్రసంగించారు.

తెలుగుదనం, తెలుగు సంస్కృతి పట్ల అందరిలోనూ ఆసక్తినీ, ఉత్సాహాన్ని పెంచడంతో బాటు, విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని గురించి మరింత తెలుసుకోవాలనే కోరిక కలిగించిందా ప్రసంగం.

తెలుగుదనాన్ని నిలుపుకోవడమంటే, తెలుగు సాహిత్యాన్ని గురించి కొంచెమైనా తెలుసుకోవడం. ఒకసారి రుచి చూస్తే వదలలేని మధురానుభూతిని కలిగించేది తెలుగు సాహిత్యం.

ఎందరో భాషాభిమానుల, సాహిత్యాభిలాషుల కోరికల, ప్రోత్సాహాల ఫలితమే ఈ సాహిత్య ఉపన్యాస పరంపర.

2013 లో ప్రపంచ మాతృదేవి సంస్మరణ ఉత్సవ శుభ సందర్భంలో ఆరంభమై, సిడ్నీ (ఆస్ట్రేలియా) లో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాలు మీకందిస్తున్నాం.

అందుకోండి !

ఆనందించండి !!

ఆదరించండి !!!

అందరికీ అందించండి !!!!

 

సాహిత్య ఉపన్యాస లహరి – ఛాయాచిత్ర లహరి