తెలుగువారందరిలో తెలుగుభాషపై అభిమానాన్నీ, తెలుగు సాహిత్యం గురించి అవగాహనను పెంచాలనే సంకల్పంతో ఆరంభమైంది తెలుగు సాహిత్య లహరి.
తెలుగుదనంలోని తియ్యదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ తలచుకొని పులకరించడానికీ, తరతరాలకు పంచడానికీ తగిన ప్రేరణ, ప్రోత్సాహం కల్పించడమే తెలుగు సాహిత్య లహరి ప్రధాన ఆశయం.
ఆ ఆశయ సాధనలో సోపానాలుగా తెలుగు సాహిత్య సమీక్షోపన్యాసాలు, ఆంధ్ర భాగవత సుధా ప్రసంగాలు, లలితా నామ భావార్ధ విశేష వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యాన ప్రచురణలు వంటి ప్రక్రియలను చేపట్టి, తెలుగు భాషాభిమానులకు స్ఫూర్తినిచ్చింది. నాటకాలు, నాటికలు, శతకాలు వంటి ప్రక్రియల ద్వారా రంగస్థల ప్రదర్శనలను, కవితా రచనలను ప్రోత్సహించింది.
ఆ ప్రక్రియలలో వెలువడిన వివిధ రచనలు పొందుపరచిన గవాక్ష వీక్షణమే ఈ “రచనా లహరి”. ఈ లహరీ సుమమాలను
అందుకోండి !
ఆనందించండి !!
ఆదరించండి !!!
అందరికీ అందించండి !!!!