తెలుగు పలుకు ఆవిష్కరణ

ఆస్ట్రేలియాలో తెలుగుదనం నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో 1988లో తెలుగు సాహిత్య పత్రిక "తెలుగు పలుకు" ప్రారంభించబడింది.

తెలుగు భాషాభిమానులైన శ్రీ నారాయణరెడ్డి గారి సంపాదకత్వంలో 15 సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా కొనసాగింది.

క్రొత్త రచనల్నీ, సరిక్రొత్త ఆలోచనల్నీ ప్రసరింపజేసి, పలువురు విద్యావేత్తల ప్రశంసల నందుకొని, ప్రపంచవ్యాప్తంగా ఎందరో తెలుగువారి ఎదల్లో నిలిచింది.

"తెలుగు పలుకు" 5వ, 10వ జన్మదినోత్సవాల సందర్భంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల వీడియోలు యూట్యూబులో ఈ క్రింద లింకుల్లో చూడవచ్చును.

20వ శతాబ్దం చివరలో, ఈ మూలెక్కడో ఉన్న భూఖండంలో వెల్లివిరిసిన తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక వికాస విలాసాలను

అందుకోండి !

ఆనందించండి !!

ఆదరించండి !!!

అందరికీ అందించండి !!!!


“తెలుగు పలుకు” ఐదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక “తెలుగు వెన్నెల” ఆవిష్కరణ సభ (1993) – ఆవిష్కరణ - సాంస్కృతిక కార్యక్రమం

“తెలుగు పలుకు” పదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక “తెలుగు వసుధ” ఆవిష్కరణ సభ (1998) – మొదటి భాగం - అవధానం

“తెలుగు పలుకు” పదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక “తెలుగు వసుధ” ఆవిష్కరణ సభ (1998) – రెండవ భాగం - సాంస్కృతిక కార్యక్రమం